
జనం న్యూస్: వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు సోమవారం జులై 13-07-2026 జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పెబ్బేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు Albendazole మాత్రలను పంపిణీ చేసి సేవింపజేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పేగు పురుగుల వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, బలహీనత, ఎదుగుదల మందగించడం, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశముందని తెలిపారు. వీటి నివారణకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ Albendazole మాత్రలను ఉచితంగా అందజేస్తోందని వివరించారు.అనంతరం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సూపర్వైజర్లు దామోదర్, లీలమ్మ, అసిస్టెంట్ రాజశేఖర్, ఆశా వర్కర్లు విద్యార్థులకు Albendazole మాత్రలను పంపిణీ చేసి సేవింపజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ భద్రాసేన్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినులు, విద్యార్థులు పాల్గొన్నారు.