
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు,జులై 3-7-2026 శుక్రవారం వనపర్తి జిల్లా,పెబ్బేరు పట్టణంలో శ్రీ సాయిబాబా మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో వరల్డ్ మెకానిక్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి పెబ్బేరు మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజ అభివృద్ధిలో మెకానిక్ల పాత్ర ఎంతో కీలకమైందని, వాహనాల నిర్వహణ, రవాణా వ్యవస్థ సజావుగా కొనసాగడంలో వారి సేవలు ప్రశంసనీయమని అన్నారు. మెకానిక్లు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం యూనియన్ సభ్యులు వరల్డ్ మెకానిక్ డే సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొని, మెకానిక్ల సంక్షేమం కోసం ఐక్యంగా పనిచేయాలని ప్రతిజ్ఞ చేశారు. మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు వెంకటేష్ సాగర్, రణధీర్ రెడ్డి, యూనియన్ నాయకులు, మెకానిక్లు భాస్కర్, బండమీది నరసింహ, ఎండి. ఉస్మాన్, ఎండి. బురాన్, విశ్వనాథ్ రెడ్డి, ఎండి. మోయిన్, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.