
జనం న్యూస్ మే 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పెళ్లి చేసుకుంటా అని యువతిని మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు సి ఐ సుధాకర్ రెడ్డి తెలిపారు వివరాల్లోకి వెళ్ళితే ఆత్మకూర్ మండలం పెంచికలపేట గ్రామానికి చెందిన దుగ్యాల నాని తండ్రి సుమన్ వయస్సు 19 అనే వ్యక్తి యువతి ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటా అని యువతిని మోసం చేయగా సదరు యువతి మనస్తాపంతో గడ్డి మందు త్రాగి హన్మకొండ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నది అని యువతి తండ్రి ఫిర్యాదు మేరకు శాయంపేట ఎస్సై జక్కుల పరమేశ్వర్ కేసు నమోదు చేయగా అట్టి నేరస్థుడైని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినట్లు సిఐ సుధాకర్ రెడ్డి ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు.....