
జనం న్యూస్ ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా, దాట్ల పృధ్వీరాజు ఇచ్చిన మాట మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలానికి చెందిన 13 మంది పేద ఎస్సీ విద్యార్థులకు మొత్తం 40,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. దాట్ల పృధ్వీరాజు అన్న దాట్ల సీతారామరాజు రెండవ వర్ధంతి సందర్భంగా ముమ్మిడివరం శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దాట్ల పృధ్వీరాజు, కుటుంబ సభ్యులు, స్నేహితులు విద్యార్థులకు నగదు అందజేశారు.విద్యార్థుల చదువుకు అండగా నిలిచేందుకే ఈ సహాయం అందిస్తున్నామని, విద్య ఒక్కటే దళిత వర్గాల అభ్యున్నతికి మార్గమని దాట్ల పృధ్వీరాజు పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధికి తమ కుటుంబం ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. సహాయం అందుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు