
సబ్ టైటిల్ :- మరమ్మతు చేయడం మరిచారా?.
జనం న్యూస్, 2026 జూన్ 25, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని, ఝరాసంగం గ్రామంలో, గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు, రోడ్డుపై నిర్మించిన వంతెన శిథిలమై పెద్ద రంధ్రం ఏర్పడింది. జహీరాబాద్ నుండి మెదక్, మరియు నిజామాబాదు వైపుకు, నిత్యం రాకపోకలు సాగించే ఈ దారిలో, వంతెన శిథిలమై పెద్ద రంధ్రం ఏర్పడటంతో, వాహనదారులు రాత్రి వేళల్లో, ప్రమాదాల బారిన పడుతున్నారని, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంతెన శిథిలమై, కూలిపోయి నెలలు గడుస్తున్నా, సంబంధిత అధికారులు వంతెనకు మరమ్మతు చేయించడం లేదన్నారు.