
జనం న్యూస్, ఆగస్టు 11 – తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; సమాజ సేవలో ముందుండే సంస్థలు ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న పోలీసు అధికారులను సైతం గుర్తించి అభినందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ క్రమంలో కూకట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్‌ను మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సీఐ సురేష్‌కు లయన్స్ క్లబ్ ప్రతినిధులు లయన్ మెమెంటోతో పాటు శాలువా కప్పి సత్కరించి, పోలీస్ శాఖ అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో కూకట్పల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ వెంకటరెడ్డి యక్కంటి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సిద్ధనోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఐ సురేష్ మాట్లాడుతూ కూకట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ప్రజా సంక్షేమం, సమాజ సేవలో పోలీస్ శాఖతో కలిసి లయన్స్ క్లబ్ మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ ప్రజా సేవలో పరస్పర సహకారంతో ముందుకు సాగుదామని తెలిపారు.పోలీస్ అధికారుల సేవలను గుర్తించి సన్మానించడం ద్వారా ప్రజలకు, పోలీస్ శాఖకు మధ్య సత్సంబంధాలు మరింత బలపడతాయని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.