
జనం న్యూస్ 03 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గద్వాల:-జోగుళాంబ గద్వాల జిల్లా పోలీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను సక్రమంగా పూర్తి చేసి నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ నూతన కార్యవర్గం లో అధ్యక్షుడిగా బి. రఘుపతి నాయుడు, ఉపాధ్యక్షులుగా వి. ప్రదీప్ కుమార్, బి. చంద్రకాంత్, కార్యదర్శిగా టి. శేఖర్, జాయింట్ సెక్రటరీగా ఎ.వై. ప్రసాద్, ట్రెజరర్‌గా శివకుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి. భీమేష్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా వై. జమ్మన్న, హనుమంతు, కె. దివ్యవాణి, జి. నాగమణి, బి. గజేంద్ర, డి. అంజనేయులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పోలీస్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను జిల్లా ఎస్పీ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...పోలీస్ అసోసియేషన్ సిబ్బంది సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా పనిచేయాలని అన్నారు. అధికారులు, సిబ్బంది మధ్య పరస్పర సమన్వయం పెంపొందిస్తూ, ప్రతి ఒక్కరి సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించేందు కు నూతన కార్యవర్గం కృషి చేయాలని సూచించారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ప్రతి సిబ్బంది సంక్షేమం ముఖ్యమని, విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం అసోసియేషన్ చొరవ తీసుకోవాలని తెలిపారు. అదే సమయంలో పోలీస్ శాఖ క్రమశిక్షణ, ప్రతిష్టకు భంగం కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సిబ్బంది సమస్యల పరిష్కారం, సంక్షేమం, ఐక్యత ప్రధాన లక్ష్యాలుగా నూతన కార్యవర్గం పనిచేస్తుందని ఆశిస్తున్నామని జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ పేర్కొన్నారు. నూతన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ, సిబ్బందికి మరియు అధికారులకు మధ్య సమన్వయ వారధిగా నిలవాలని, పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని నూతన కార్యవర్గ సభ్యులకు సూచించారు.