
జనం న్యూస్ 31మే పెగడపల్ల జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామపూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సర్పంచ్ చిర్ర రజిత-రమణాకర్ మాట్లాడుతూ సమాజంలో జాతి, కులం, మతం, లింగంతో సంబంధం లేకుండా ప్రతి మనిషికి పుట్టుకతోనే వచ్చే స్వేచ్ఛ, హక్కుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎలాగందుల విష్ణు, వార్డు సభ్యులు గుమ్మడి స్వప్న-ప్రేమ్ సాగర్, దప్పు లచ్చయ్య, రామడుగు వెంకటేష్ మరియు అధికారులు మండల గిర్ధావర్ శ్రీనివాస్, పి హెచ్ ఓ మహేష్, జీపీవో అపర్ణ, హెడ్ కానిస్టేబుల్ రవీందర్, గ్రామ వీపీవో శ్రీనివాస్ మరియు అంబేద్కర్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.