
ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాసంశెట్టి సుభాష్
జనం న్యూస్ సెప్టెంబర్ 2ముమ్మిడివరంప్రతినిధిగ్రంధినానాజీఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ప్రజల కష్టసుఖాలను తనవిగా భావించి ప్రజాసేవనే జీవిత లక్ష్యంగా ఎంచుకున్న అరుదైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, యువత భవిష్యత్తు కోసం, రైతులు మరియు కార్మికుల సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.నిజాయితీ, నిబద్ధత, సేవా తత్వం, ప్రజల పట్ల అంకితభావం కలిగిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించు కున్నారని మంత్రి అన్నారు. రాజకీయాల్లో విలువలు, బాధ్యతాయుతమైన పాలన, పారదర్శకతకు ఆయన ప్రతీకగా నిలిచారని తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా, రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజలకు మరింత చేరువవు తున్నారని కొనియాడారు.రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు సాగేందుకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, సేవలు చిరస్మరణీయమని మంత్రి సుభాష్ పేర్కొన్నారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు, ఆనందం, మరిన్ని విజయాలు ప్రసాదించి ప్రజాసేవలో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.