
ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా వాణి ప్రారంభం….
బిచ్కుంద ఆగస్టు 17 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో బిచ్కుంద మండలస్థాయి ప్రజావాణి ద్వారా ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని బిచ్కుంద ఎంపీడీఓ గోపాలకృష్ణ కుమార్ సూచించారు.మండలస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం బిచ్కుంద ఎంపీడీఓ సమావేశ మందిరంలో నిర్వహించారు.తొలిరోజు నిర్వహించిన ప్రజావాణిలో బిచ్కుంద తండా వాసులు బాబు పండరి ఈరోజు ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో రాజుల చౌరస్తా నుండి పిడుగు మైసమ్మ వరకు రోడ్డు గురించి ఫిర్యాదు చేశారు మరియు తండాలో మిషన్ భగీరథ నీరు కలుషితమై మట్టి రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు చేశారు అదేవిధంగా రాములు సేట్ ఇంటి నుంచి తండా వరకు బీటీ రోడ్డు శాంక్షన్ అయింది కానీ పనులు చేయడం లేదని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు ఈరోజు ప్రజావాణికి 18 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీఓ తెలిపారు.ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్ ఎంపీవో కృష్ణ విద్యాశాఖ అధికారి పంచాయతీరాజ్ ఏఈ తదితర అధికారులు పాల్గొన్నారు