
జనం న్యూస్ 03 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి నివేదిక బస్సు యాత్ర ను నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డా. మల్లు రవి జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకలు అభివృద్ధి సహకార సమాఖ్య చైర్పర్సన్ శ్రీమతి సరిత తిరుపతయ్య అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి డా సంపత్ కుమార్ జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు గద్వాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శంకర్ డీసీసీబీ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ముందుగా ఎర్రవల్లి మండల కేంద్రంలో డా. మల్లు రవి కి చైర్పర్సన్ సరిత తిరుపతయ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయంను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా సరితమ్మ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గత రెండున్నరేళ్ల కాలంలో ప్రజా జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకువచ్చిందని కొనియాడారు ప్రజా పాలన ఫలిస్తోంది తెలంగాణ గెలుస్తోంది అనే నినాదంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత, విద్యా రంగంలో సంస్కరణలు, సామాజిక న్యాయం కుల గణన హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, పెట్టుబడులు ఉపాధి అవకాశాలు గ్రామీణ & పట్టణ అభివృద్ధి, ప్రజా ప్రభుత్వం ప్రజలకోసం పాలనఈ ప్రగతి నివేదిక ద్వారా ప్రభుత్వం సాధించిన 13 ప్రధాన విజయాలను మరియు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బస్సు యాత్ర కొనసాగుతుందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాజా మాజీ సర్పంచ్ లు మాజీ జడ్పీటీసీ లు ఎంపీటీసీ లు కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను జయప్రదం చేశారు