
జనం న్యూస్ జున్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రోడ్డు ప్రమాదాల నియంత్రణ గురించి ప్రజా సంక్షేమ వేదిక సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పోస్టర్స్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి రోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని ప్రమాదాల బారిన పడకుండా హెల్మెట్ సీటు బెల్టు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనం నడపకూడదు ప్రయాణాల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించి క్షేమంగా ప్రయాణించాలని అని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజా సంక్షేమ వేదిక అధ్యక్షులు మడికొండ రఘుపతి నాయకులు శనిగరపు శ్రీనివాస్ సి హెచ్ కృష్ణ ఎస్ సందీప్ సంగు రాజు మడికొండ ఛత్రపతి ఏకు అజయ్ బోట్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు....