
జనం న్యూస్ జూలై 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం మురమళ్ళ* ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మురమళ్ళలోని శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు.నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక మరియు మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలపై వినతిపత్రాలను ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు కు అందజేశారు.అర్జీదారుల సమస్యలను శ్రద్ధగా విన్న దాట్ల సుబ్బరాజు వెంటనే పరిష్కరించగల అంశాలపై సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిగిలిన సమస్యలను సంబంధిత శాఖల ద్వారా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇతర కొన్ని సమస్యలను పీజీఆర్ఎస్ పోర్టల్లో నమోదు చేసి నిరంతరం పర్యవేక్షించాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని దాట్ల సుబ్బరాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు ఐ పోలవరం మండల టిడిపి అధ్యక్షులు సాయిరాజ్ సూరిబాబు రాజు రాజేష్ దాట్ల పృద్వి దాట్ల పవన్ గొల్ల కోటి దొరబాబు కూటమ నాయకులు తదితరులు ఉన్నారు