
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కొనసీమ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయం, అమలాపురంలో శుక్రవారం 'జనతా వారధి' కార్యక్రమాన్ని జిల్లా కార్యాలయ ఇన్చార్జి, జనతా వారధి జిల్లా కో. కన్వీనర్ డి.వి.ఎస్. రాజు అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ చీకరమెల్లి శ్రీనివాసరావు హాజరై ప్రజల నుంచి వినతిపత్రాలు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు పార్టీకి మధ్య వారధిగా 'జనతా వారధి' కార్యక్రమం సమర్థవంతంగా పనిచేస్తోందని ఆయన అన్నారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డి.వి.ఎస్. రాజు మాట్లాడుతూ, ప్రజల నుంచి అందిన ప్రతి వినతిని పరిశీలించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అమలాపురం టౌన్ మండల అధ్యక్షుడు అయ్యాల భాస్కరరావు, పి. గన్నవరం మండల అధ్యక్షుడు తిక్క సత్యనారాయణతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.