
జనం న్యూస్ జూన్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జనతా వారధి’ కార్యక్రమం శుక్రవారం అమలాపురంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో విజయవంతంగా జరిగింది.జిల్లా జనతా వారధి కన్వీనర్ చీకరమెల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్ల పవన్ కుమార్, సీనియర్ నాయకుడు కోన సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతిపత్రాలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిశీలించిన నాయకులు సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పలు అంశాలపై తక్షణ స్పందన వచ్చేలా చర్యలు చేపట్టారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి వేదికగా ‘జనతా వారధి’ కార్యక్రమం కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు. ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా జనతా వారధి కో-కన్వీనర్ దాట్ల వెంకట సుబ్బరాజు, అమలాపురం టౌన్ అధ్యక్షుడు అయ్యాల భాస్కరరావు, జిల్లా సర్ సోషల్ మీడియా కన్వీనర్ పెద్దిరెడ్డి శ్రీనివాస్, అమలాపురం నియోజకవర్గ సర్ కన్వీనర్ సంసాని రత్నకుమార్, బీజేపీ యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మాకిరెడ్డి మనోజ్, ఆరిగెల తేజ వెంకట్, బండి శ్రీనివాస్, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు రామదాస్, పాము పురుషోత్తం, పాము గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు.