
జుక్కల్ ఆగస్టు 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్ గల్ మండలం జడ్పీహెచ్ఎస్ కాటేపల్లి పాఠశాలలో పదో తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని సాబ్లె నందిని తరపున ఆమె తల్లి శ్రీమతి జేవంతి మధుసింగ్ కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ రూ.11,000 విలువైన చెక్కును ప్రోత్సాహక బహుమతిగా మంగళవారం కాటేపల్లి పాఠశాలలో అందజేశారు.ఈ సందర్భంగా విద్యార్థిని విజయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, నందిని తల్లి జేవంతి మధుసింగ్ను ఘనంగా సన్మానించారు.అదేవిధంగా, జడ్పీహెచ్ఎస్ కాటేపల్లి పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడంలో ఉపాధ్యాయులందరి కృషి ప్రశంసనీయమని కొనియాడారు. ఉపాధ్యాయులందరి తరపున పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల ఇంచార్జి విద్యాధికారి ప్రవీణ్ కుమార్ ను మల్లప్ప పటేల్ శాలువాతో సన్మానించి అభినందించారు.విద్యార్థులను ప్రోత్సహించడం, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సేవలను గుర్తించడం సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని ఈ సందర్భంగా మల్లప్ప పటేల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టీ యాదవ్ , మూడ్ శంకర్, ఆర్ లలిత, వి సునీత , ఎం సుజాత, ఎం భక్షిరామ్, జి మంజుల, పి అశోక్, దేవదాస్ విద్యార్థులు పాల్గొన్నారు.