
జనం న్యూస్ 08 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాలలో వైద్య నిర్లక్ష్యానికి బాలిక బలి నిరసనకారులపై పోలీసుల లాఠీఛార్జ్ వైద్యో నారాయణో హరి కాదు పేదల్ని చంపుతున్న ప్రభుత్వ ఆసుపత్రి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘోరం: వైద్యుల నిర్లక్ష్యానికి బాలిక బలి కన్నపేగు తెగిన దుఃఖంలో కుటుంబం కన్నీళ్లపై ఖాకీల బూట్ల గుర్తులు మానవత్వం మరిచిన పోలీసులు: నిరసన హక్కును ఈడ్చిపారేసిన వైనం ఓట్ల వేటలో వంద అబద్ధాలు కష్టమొస్తే కనపడని పీఠమెక్కిన నాయకులు పశువులకంటే హీనంగా ప్రవర్తన రక్తాలు కారుతున్నా నిరసనకారులను జీపుల్లోకి తోసేసిన పోలీసులు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. కనీస సౌకర్యాలు కరువై వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక అమాయక బాలిక ప్రాణం గాల్లో కలిసిపోయింది కన్నబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు న్యాయం చేయాల్సింది పోయి పోలీసులు అత్యుత్సాహం చూపి మానవత్వాన్ని మంటగలిపారు *రోడ్డుపైకి బాధితులు ఖాకీల జులూం:* పాప మరణానికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఉద్యమకారులు రోడ్డుపై నిరసనకు దిగారు అయితే అక్కడ శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు అత్యుత్సాహంతో నిరసనకారులపై లాఠీ ఝులిపించారు. రక్తాలు కారుతున్నా లెక్కచేయకుండా, చనిపోయిన పశువులను తరలించినట్లు ప్రజలను రోడ్డుపై ఈడ్చిపారేస్తూ బలవంతంగా జీపుల్లోకి ఎక్కించారు. గద్వాలలో ఏ నిరసన కార్యక్రమం జరిగినా పోలీసులు ఇంతే క్రూరంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండి పడుతున్నారు.*ఓట్లప్పుడే గుర్తొచ్చే ప్రజలు పాలకుల మౌనం:* స్థానికంగా ప్రజల ఓట్లతో గెలిచి పీఠాలెక్కిన నాయకులు ఒక్కరు కూడా ఈ ఘటనపై నోరు మెదపకపోవడం గమనార్హం మాకెందుకులే పేదల ప్రాణాలు అన్నట్లుగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. ఓట్ల సమయంలో వంద అబద్ధాలు చెప్పి లబ్ధి పొందే నాయకులు ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే కనీసం పరామర్శించడానికి కూడా రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. *ఇప్పటికైనా మారాలి:* జోగుళాంబ గద్వాల ఆసుపత్రిలో ఇలాంటి ఘోరాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజలు, మేధావులు ఆలోచించాలి. మనకు ఎలాంటి వైద్యం అందుతోంది ఎలాంటి నాయకులను మనం ఎన్నుకుంటున్నాం అని ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయాల వైపు ఆలోచించాలని మేధావులు పిలుపునిస్తున్నారు