
--- సమయానికి విధులకు రాని సిబ్బంది.. హాజరు పట్టిక పరిశీలన
---సిబ్బంది నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్కు ఎమ్మెల్యే ఫిర్యాదు
బిచ్కుంద ఆగస్టు 14 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో విధుల నిర్వహణ, సిబ్బంది హాజరు తదితర అంశాలను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా సమయానికి విధులకు హాజరుకాని సిబ్బంది వివరాలను పరిశీలించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ,హాజరు పట్టికను స్వయంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని, విధుల్లో నిర్లక్ష్యం సహించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేసినట్లు తెలిపారు.బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అంశంపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఫిర్యాదు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆసుపత్రిలో వైద్య సేవలు నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది సమయపాలన, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఇకపై మరింత కఠినంగా పర్యవేక్షణ ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.