
జనం న్యూస్, ఆగస్టు 7 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి :కూకట్పల్లి హనుమాన్ నగర్ కాలనీలోని మెయిన్ రోడ్డుపై ఉన్న ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే రోజురోజుకు చెత్త డంపింగ్ పెరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరించే ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ, కొందరు నిర్లక్ష్యంగా రాత్రి వేళల్లో ఆసుపత్రి పక్కనే చెత్తను పడేస్తుండటంతో అక్కడ భారీగా వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. అంతేకాకుండా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కొందరు వాహనదారులు కూడా ఇదే ప్రదేశంలో చెత్తను పారవేయడంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోంది.చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వ్యాపించి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు, సిబ్బంది, స్థానిక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వర్షాకాలంలో దోమలు, ఈగలు పెరిగి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం కూడా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జరిమానా బోర్డు ఏర్పాటు చేయాలని కాలనీవాసు కోరుతున్నారుఈ సమస్యపై సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చెత్త డంపింగ్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రజల్లో అవగాహన కల్పించి పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.