
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశంజహీరాబాద్, జూన్ 10:ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమే అయినప్పటికీ తన కర్తవ్య నిర్వహణలో ప్రజలకు మేలు చేసినవారే చిరస్మరణీయంగా గుర్తుండి పోతారని జహీరాబాద్ ఇరిగేషన్ కార్యానిర్వాహక ఇంజనీర్ సి విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. జహీరాబాద్ ఇరిగేషన్ డివిజన్ లో గత నాలుగు సంవత్సరాలకు పైగా విశిష్ట సేవలందించి బదిలీ పై వెళుతున్న రాయికోడ్ ఉపకార్య నిర్వాహక ఇంజనీర్ రాజ్యలక్ష్మి, సహాయ ఇంజనీర్ రవీందర్ ల వీడ్కోలు సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాయికోడ్ సబ్ డివిజన్ ఉప కార్య నిర్వాహక ఇంజనీర్ తో పాటుగా టెక్నికల్ డి ఇ ఇ గా మేధోవంత మైన పనులను నిర్వహించి రాజ్యలక్ష్మి జహీరాబాద్ డివిజన్ రూపు రేఖలను ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్లారని శ్లాఘించారు. ప్రధానంగా రాయికోడ్ మండలం బొగ్గులంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో రాజ్యలక్ష్మి పోషించిన పాత్ర అమోఘమని కితాబిచ్చారు. ఈ సందర్భంగా డి ఇ ఇ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ తన ఉద్యోగ నిర్వహణలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. జహీరా బాద్ డివిజన్ లో ప్రతీ ఉద్యోగి పరిణతి చెందిన వారే ఉన్నారని చెబుతూ వారి అనుభవం తనకెంతో నేర్పించిందన్నారు. కొత్త వారికి స్వాగతం పలుకుతూ పాత వారికి వీడ్కోలు పలకడం మంచి పరిణామమని రాయికోడ్ డి ఇ ఇ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో టెక్నికల్ డి ఇ ఇ జ్యోత్స్న, జహీరాబాద్, న్యాలకల్, ఝరాసంగం, మొగుడంపల్లి డి ఇ ఇ లు శుక్లజ కళ్యాణం, జనార్దన్ రావు, భార్గవి, సుజాత, ఏ ఇ ఇ లు స్టాలిన్, పాండు, శ్రీనివాస్, జానకిరామ్, తేజశ్రీ, సాయి కృష్ణ, శ్రీలత, లావణ్య, దీపిక, వెంకన్న, రవి, అలేఖ్య, అయూబ్, కార్తికేయ, సూపరింటెండెంట్ వెంకట్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ లు రఘు, జహీర్, నవాజ్, ప్రసాద్, సిబ్బంది అనిరుధ్, గంగాధర్, ఉమా సింధూరి, తులసి, సుధా, గిరి, శంకర్, లస్కర్లు చోటు, పాండు, రాజు, సాయి, పూలమ్మ, యాస్మిన్, షబానా బేగం, సుశీల, సుధాకర్, ఆరిఫ్, అంజన్న, వెంకటి, పాపన్న, ఆఫీస్ సబార్డినేట్ లు ప్రవీణ్, మోహన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.