
బిచ్కుంద ఆగస్ట్ 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటనామస్ నందు ప్రొఫెసర్ జయశంకర్ సార్ 92 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కె.అశోక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అసమానతలను ఎత్తిచూపుతూ, తెలంగాణ ప్రజలలో చైతన్య దివిటీ ని వెలిగించిన గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ కు జరుగుతున్న అన్యాయాలను గణాంకాలతో సహా వివరించేవారని ఆయన జీవిత విశేషాలు, విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా జి.వెంకటేశం,అకడమిక్ కోఆర్డినేటర్ డా.టి.హన్మండ్లు,IQAC కోఆర్డినేటర్ డా.జి.రమేష్ బాబు, PG కోఆర్డినేటర్ టి. సంతోష్ కుమార్ మరియు అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు