

బిచ్కుంద సెప్టెంబర్ 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) బిచ్కుంద లో నేడు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. భారత మాజీ రాష్ట్రపతి, గొప్ప తత్త్వవేత్త, ఆదర్శ ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కె. అశోక్, సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... సమాజ నిర్మాణంలో గురువు పాత్ర అత్యంత కీలకమైనదని, క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే ఉపాధ్యాయుల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన "స్టూడెంట్ యాజ్ ఎ టీచర్" (Student as a Teacher) కార్యక్రమంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు బోధన చేశారు.ఉపాధ్యాయుని పాత్రలో బోధించడం తమకు ఎంతో సంతృప్తిని, కొత్త అనుభూతిని ఇచ్చిందని విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి. వెంకటేశం, పీజీ కో-ఆర్డినేటర్ టి. సంతోష్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు