
జనం న్యూస్ 10 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలని అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాది, ప్రస్తుతం విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆఫ్లైన్ ఆన్లైన్ నివేదికలను అందజేయాల్సిందిగా ఆదేశించారు. ఎన్రోల్మెంట్ పెంచే టాప్ ముగ్గురు డిఈఓలకు ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో పతకాలను ఎంఈఓలకు జిల్లా స్థాయిలో ప్రోత్సాహకాలు అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు వస్తున్న విద్యార్థులకు ప్రైవేటు యాజమాన్యాలు బోనఫైడ్, టీసీలు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే సహించేది లేదని తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అపార్ నమోదు పెరగాలని ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకు రెన్యువల్ కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు సహకరించాలన్నారు. ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో అంగన్వాడి కేంద్రాల చిన్నారులు పెద్ద సంఖ్యలో చేరేలా కృషి చేయాలన్నారు. మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం రుచికరంగా వండించాలని ఆదేశించారు ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో విద్యాబోధన చేసేందుకు విశ్రాంత ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు రావచ్చని ఈ ఏడాది విద్యార్థుల ప్రవేశాలు పెరిగిన పాఠశాలలకు విద్యా వాలంటీర్లను నియమిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి రాజ్ కుమార్ డీఈవో విజయలక్ష్మి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్ బాషా సెక్టోరియల్ అధికారులు ఎంఈఓలు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.