
మరో గ్రంథాలయ ఉద్యమ నాయకులు కస్తూరి ప్రభాకర్
జనం న్యూస్: జూన్ 29 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్ : నిడమనూరు ఉన్నత పాఠశాలలో చదివిన విద్యార్థులు, జీవన విలువలు, మానవీయ సంబంధాలు కలిగి తమ చేసే వృత్తిపట్ల తల్లిదండ్రుల పట్ల టీచర్ల పట్ల గ్రామం పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తులుగా ఎదగడం ఇతరులకు సహాయపడటం గర్వించదగ్గ విషయం అని అందులో భాగంగా నిడమనూరు పాఠశాలలో 2010-11 సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థులు తాము చదివిన పాఠశాలకు పదివేల రూపాయల విరాళాన్ని, విద్యార్థులు చదువుకోడానికి బాలసాహిత్యం జీవన చరిత్రలో గ్రంథాలయ పుస్తకాలు బహుకరించడం అభినంద నీయమని కస్తూరి ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ పేరు మీద ప్రభుత్వ బడులు ప్రమాణాలు తగ్గాయనే అపవాదుతో ప్రభుత్వం బడులు మూసి వేయదలుచుకున్నది. ఎందుకు భిన్నంగా స్థానిక ప్రజలు ఉచితంగా విలువైన విద్యను అందించే పేదపరులను ఊరూరా కాపాడుకోవాలని అన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే భవిష్యత్తు నిర్మాతలుగా జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొనే నిలబడగలిగిన మానవీయ మనుషులుగా ఎదిగారని, అందుకోసం పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చి పాఠశాలల్లో పనిచేయని టీచర్ల పట్ల పేరెంట్స్ మీటింగ్లో అడగటం, పాఠశాల అభివృద్ధి కోసం స్థానిక ప్రతినిధుల ప్రజల సహకారంతో అన్ని వసతులు వనరులు సమకూర్చుకొని పిల్లలకు ఉచితంగా విద్యను అందించే బడులను కాపాడుకోవాలని అన్నారు. ఇంచార్జి హెడ్ మాస్టర్ రామ్మోహన్, పూర్వ ఉపాధ్యాయుడు ఎల్ అంజయ్య, జలంధర్, విజయలక్ష్మి, పూర్వ విద్యార్థులు కిరణ్ , నరసింహ,మహేష్, రమేష్ పాల్గొన్నారు..