
జనం న్యూస్, జూలై 8, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో ఈ రోజు విశ్వబ్రాహ్మణ వర్గానికి చెందిన అధికారులు కీలక ప్రభుత్వ పదవుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సందర్భంగా మెట్ పల్లీ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మెట్ పల్లి CDPO పద్మజ మరియు రాయికల్ MRO రామోజు నాగార్జునలకు మెట్ పల్లి స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా మెట్ పల్లి స్వర్ణకార సంఘం సభ్యులు CDPO పద్మజను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అలాగే రాయికల్ MRO రామోజు నాగార్జునకు స్వర్ణకార సంఘం, సిల్వర్ జువెలరీ మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఘనంగా సన్మానం నిర్వహించారు.ప్రభుత్వ సేవలో ఉన్నత బాధ్యతలు నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న అధికారులు మరింత ఉన్నత స్థానాలకు చేరుకుని ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని పలువురు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షులు వంగల మహేష్, వెండి బంగారు వర్తక సంగం ఉప అధ్యక్షులు గాలిపెల్లి నాగరాజు, జిల్లా ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు కోటగిరి దశరథం, సిల్వర్ జువెలరీ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు తోగిటి రమేష్, సెక్రటరీ కోటగిరి తిరుమల, కోశాధికారి తునికి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఇల్లెందుల కృష్ణమాచారి, ఇల్లెందుల శ్రీనివాస్, బెజ్జరపు మురళి, బాజోజి సురేష్ తదితరులు పాల్గొన్నారు.