
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రిపోర్టర్ కటికల శివకుమార్ పెబ్బేరు జూన్ 20 2026 వనపర్తి జిల్లా పెబ్బేరు నిన్న సాయంత్రం
జడ్చర్ల దగ్గర జాతీయ రహదారుపై, బోలోరో వాహనం వెనుక నుంచి డీసీఎం, ఢీకొనగా, అందులోనుంచి నలుగురు త్రీవంగా గాయపడ్డారు. త్రీవంగా గాయపడిన వారిలో వెంకటేష్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్తి. అతని దగ్గర ఉన్న 6 లక్షల రూపాయలను 108,సిబ్బంది, ఆ డబ్బును అలాగే భద్రపరిచి, పోలీసులకు అప్పజెప్పడం జరిగింది.అందుకే మానవత్వం పరిమళించిన వేళ.కొన్ని ఊర్లో అయితే,యాక్సిడెంట్లో చనిపోయిన, శవాలపై! నుంచి, బంగారు, నగదు తీసుకుపోయే! ఈ రోజుల్లో,ఇలాంటి వారు ఉండడం అభినందనీయం