
జనం న్యూస్, ఆగస్టు 17 – తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలోని భాగ్యనగర్ కాలనీ సాయిబాబా టెంపుల్ సమీపంలో ప్రైమ్ ఫిన్టెక్ అసోసియేట్ నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ నిర్వాహకులను పలువురు ప్రముఖులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అభినందించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రైమ్ ఫిన్టెక్ అసోసియేట్ ద్వారా వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, ఆస్తిపై రుణాలు, కార్ లోన్లతో పాటు వివిధ ఆర్థిక సేవలను అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో అనుసంధానమై వినియోగదారుల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా సేవలు అందించడమే లక్ష్యంగా సంస్థ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.కేపీహెచ్బీ కాలనీలో స్థానికులకు అందుబాటులో ఉండేలా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు పారదర్శకమైన ఆర్థిక సేవలు అందిస్తూ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ కొడపర్తి బాబు నామాల శ్రీధర్ గౌడ్ దత్తులూరి అశోక్ నర్సింగ్ రావు శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు