
జనం న్యూస్ 26 మే జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; జిల్లాలో మౌలిక సదుపాయాలు లేని ప్రైవేటు పాఠశాలల రికగ్నైజేషన్ పర్మిషన్ రద్దు చేయాలి కలెక్టర్ కి ఫిర్యాదు బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ప్రతి ప్రవేట్ స్కూల్లో ఫీజుల పట్టికను బహిరంగంగా నోటీసు బోర్డులో పెట్టాలి అకాడమీక్ ఇయర్ ప్రారంభం కాకముందే ఊర్లలో కాన్వాసింగ్ బుక్కుల అమ్మకాలు టైం బెల్ట్ ల అమ్మకాలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి ఇండ్ల ఆకారంలో లాడ్జిల్లా ఆకారంలో కొట్టాల ఆకారంలో రేకుల గుడిసె ల ఆకారంలో నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలి ఈ సందర్బంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ జిల్లాలో చాలా కాలం నుండి సదుపాయాలు లేకుండా నాణ్యమైన విద్యను అందించకుండా వేలలలో లక్షలలో అధిక ఫీజులు వసూలు చేసుకుంటూ కేవలం విద్యను వ్యాపారం చేసుకుంటున్నా స్కూల్స్లకు పర్మిషన్లు రద్దు చేయాలి జిల్లాలో ఎక్కువ శాతం ప్రైవేటు స్కూల్స్ ఇండ్లలో లాడ్జ్ ఆకారంలో మరియు కొట్టాల ఆకారంలో స్కూల్స్ లను నడుపుతున్నారు వాటితో సొమ్ము చేసుకుంటున్నారు. అందులో ఏ ఒక్క సౌకర్యం కూడా కల్పించడం లేదు పాఠశాలలలో ప్రేయర్ చేయించడానికి స్థలం కూడా లేదు ప్రహరీ గోడలు లేవు బాత్రూమ్స్ లేవు తరగతి గదులు లేవు, అట స్థలాలు లేవు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తక్కువ జీతాల కోసం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో టెట్ గాని బి.ఎడ్ లో టెట్ అర్హత కలిగిన వారిని నియమించకుండా నాసిరకంతో చదువులు చెప్పిస్తున్నారు జిల్లాలో అంతర్జాతీయ, జాతీయ లెవల్లో పేర్లు పెట్టి పేద తల్లిదండ్రులను మోసం చేస్తూ లక్షలలో ఫీజులు వసూలు చేయడానికి మాత్రమే స్కూల్ పేర్లను అందంగా చూపిస్తున్నారు పేదల రక్తాన్ని జలగ లాగా పీల్చుకా తింటున్నారు అదేవిధంగా అకాడమీ క్లియర్ ప్రారంభమైంది అంటే చాలు బుక్స్ పేరుతో దోపిడీ టైం బెల్టు డ్రెస్ పేర్లతో దోపిడీ బస్సుల పేర్లతో దోపిడి దోపిడి మీద దోపిడీ చేస్తున్న ప్రైవేటు స్కూల్ యొక్క ఆగడాలను కచ్చితంగా కట్టడి చేయాలని డిమాండ్ చేశారు విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రవేటు పాఠశాలలో 25% బడుగు బలహీన వర్గాలకు సీట్లు కేటాయించాలి దాన్ని తుంగలో తొక్కుతున్నారు ఆ చట్టం ప్రకారం నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలి కానీ అంతకు మించి వేలలో లక్షలలో వసూలు చేస్తున్నారు. చర్యలు తీసుకోలేని పక్షంలో బిఆర్ఎస్వి పోరాటం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కొమ్ము రంగస్వామి నరసింహ మహేష్ తదితరులు పాల్గొన్నారు