
జనం న్యూస్ ; 20జూలై సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జివై . రమేష్ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఫీజుల దోపిడి పై స్పందించి ఈనెల 30వ తేదీ లోపు ఆడిట్ రిపోర్టులు మరియు ఫీజుల వివరాలను నోటీస్ బోర్డులో ఉంచాలని తీసుకున్న నిర్ణయాన్ని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ స్వాగతిస్తున్నట్లు పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి గుడికందుల రవి మాట్లాడుతూ ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై యజమాన్యాలు అక్రమ పద్ధతిలో వసూలు చేసే డబ్బులపై మా సంఘం ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహించామని, ఆ నిర్ణయాలకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకోవడం సరైందని వారు అన్నారు. ఈ నిర్ణయాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా ఈ నిర్ణయాన్ని కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా ఆచరణలో తమిళనాడు ప్రభుత్వం లాగా పని చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా వ్యవహరించాలని అన్నారు. అదేవిధంగా జూనియర్ కళాశాలల ఫీజుల దోపిడీపై మరియు తప్పుడు ర్యాంకులపై ప్రచారం చేస్తున్న కళాశాలల యజమాన్యాలపై కేసులు నమోదు చేయాలని అన్నారు. నీట్ రిజల్ట్ లో రాష్ట్రంలో రానీ తప్పుడు రిజల్ట్ కూడా శ్రీ చైతన్య, నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థల యజమాన్యం ప్రచారం చేస్తుందని దీనిపై ఇంటర్ బోర్డు వ్యవస్థ కూడా స్పందించాలని కోరారు. లేనిపక్షంలో దశలవారి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు…ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి పుట్ల హేమంత్ జిల్లా నాయకులు లడ్డూ,సాయిరాం తదితరులు పాల్గొన్నారు.