
జనం న్యూస్ జూన్ 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఎండాకాలంలో నీటి ఎద్దుడ లేకుండా ప్రజలకు మంచినీరు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు పదే పదే చెప్పినప్పటికీ అనకాపల్లి జోన్ జీవీఎంసీ కార్యాలయంలో వాటర్ వర్క్స్ అధికారుల్లో స్పందన లేదని, నిర్లక్ష్య వైఖరితో ఉన్నారని 84 వ వార్డు మాజీ కౌన్సిలర్ కుప్పిలి జగన్ ఆవేదన వ్యక్తపరిచారు. నెల రోజుల నుండి సాంబమూర్తి కోవెల ఏరియాలో మంచినీటి పైపులు పగిలిపోవడం వల్ల జీవీఎంసీ కొళాయిల నుండి మంచినీరు అందక మహిళలు నానా అగచాట్లు పడుతున్న విషయాన్ని జీవీఎంసీ వాటర్ వర్క్స్ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ నెల రోజులు కావస్తున్న పట్టించుకోవడంలేదని, జీవీఎంసీ కార్యాలయానికి తిరిగినప్పటికీ కూడా అధికారులు అందుబాటు లో లేరని, జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తారన్న ఆమె అందుబాటులో ఉండటం లేదని జగన్ అన్నారు. రెండు మూడు రోజులో సమస్య పరిష్కారం కాకపోతే జీవీఎంసీ కార్యాలయంలో మహిళలతో ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహిస్తామని కుప్పిలి జగన్ తెలిపారు.//