
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం ఆగస్టు. 02. 08. 2026 తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అనిశ్చితిలో పడింది. రెండు సంవత్సరాలకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా అనేక ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేస్తు విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా మానసికకంగా వేదిస్తున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులను, కళాశాలలను ఈ సంక్షోభం నుంచి బయటపడేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.7,000 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని సమాచారం. ఈ పరిస్థితి వల్ల పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు ఉద్యోగాలు, ఉన్నత విద్య అవకాశాలు కోల్పోతున్నారు.ఈ విషయంలో న్యాయస్థానాలు కూడా స్పష్టంగా పేర్కొన్న విషయం గుర్తు చేస్తున్నాం. ఫీజు బకాయిల కారణంగా విద్యార్థుల ఒరిజినల్ విద్యా సర్టిఫికెట్లను కళాశాలలు నిలిపివేయడం చట్టబద్ధం కాదని,ఒరిజినల్ సర్టిఫికెట్లు విద్యార్థులకు ఇవ్వాల్సిందే అని పలు సందర్భాల్లో ఉన్నత న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. విద్యార్థుల భవిష్యత్తును కాలరాసే హక్కు ఏ విద్యాసంస్థకూ లేదు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునిపెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి.ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేసిన కళాశాలలపై తక్షణ చర్యలు తీసుకోవాలి.విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్టిఫికెట్లు అందేలా ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాలి.బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులకు అండగా ఉండి వారి హక్కుల కోసం ఎల్లప్పుడూ పోరాడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడడం మానుకోవాలని ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము.ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి,రాంచంద్రారెడ్డి,లు ఉన్నారు