
జనం న్యూస్ 25 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఈ రోజు డికె.బంగ్లా లో రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ కార్యాచరణ పోస్టర్ను విడుదల చేసిన జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూరాష్ట్రంలోని విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ ఉద్యమంలో భాగంగా ఈ నెల జూలై25,26 తేదీన జిల్లా కేంద్రాల్లో 500 మంది కళాశాల విద్యార్థులతో గెట్ మీటింగ్ లు తో పాటుమిస్డ్ కాల్ సంతకాల సేకరణ ముక్య ఉద్దేశం ప్రతి విద్యార్థి కి చేరేలా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆగస్టు 7 నుంచి 12 వరకు జిల్లా కేంద్రాల్లో 5,000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీలు అనంతరం ఆగస్టు 17, 18 తేదీల్లో కళాశాల విద్యార్థులు, విద్యార్థి సంఘాలు కలిసి భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నివాసాల ముట్టడి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని బిజెపి నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకటరాములు జిల్లా ప్రధానకార్యదర్శి శ్యామ్ రావ్ జిల్లా బిజెవైఎం అధ్యక్షుడు బాబుల్ రెడ్డి జిల్లా మహిళా మోర్చఅధ్యక్షురాలు సమత గౌడ్ కౌన్సిలర్ శాలన్న, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యుడు అనిల్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి బీజేవైఎం నాయకులు పటేల్ పాండు మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు