
జనం న్యూస్ జూలై 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో "లింక్‌ను షేర్ చేస్తే ఐదు వేల రూపాయలు వస్తాయి" అంటూ ప్రచారం చేస్తున్న సందేశాలను ప్రజలు నమ్మవద్దని మాడుగులపల్లి ఎస్సై క్రిష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ఇలాంటి లింకులు పూర్తిగా నకిలీవని, వాటిని క్లిక్ చేయడం లేదా ఇతరులకు షేర్ చేయడం వల్ల సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకునే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఫోన్ హ్యాక్ కావడం, వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు వస్తాయనే ఆశతో ఇటువంటి ఫేక్ లింకులను నమ్మకుండా, వాటిని ఏ వాట్సాప్ గ్రూపులోనూ ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలకు సూచించారు. అనుమానాస్పద లింకులు లేదా సైబర్ మోసాలకు సంబంధించిన సమాచారం ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్సై క్రిష్ణయ్య కోరారు