
జనం న్యూస్ మే 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బక్రీద్ పండుగ సందర్భంగా పీస్ కమిటీ సమావేశం పోలీస్ స్టేషన్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐ సుధాకర్ రెడ్డి ఎస్సై జక్కుల పరమేశ్వర్ పాల్గొని, అనంతరం సి ఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ముస్లిం సోదరులకు తెలియజేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరస్పర సహకారంతో పండుగను ప్రశాంతంగా నిర్వహించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శాయంపేట గ్రామ ముస్లిం గ్రామ అధ్యక్షులు ఎం డి నసీరుద్దీన్ ఎం డి బాషుమమం ఇమామ్ గౌరవ అధ్యక్షులు ఎం డి రఫీ ఎం డి గపూర్ ఎం డి జాకీర్ గ్రామ ఉప అధ్యక్షులు ఎం డి జాన్ షైదా తదితరులు పాల్గొన్నారు.