
జనం న్యూస్ 15 జూలై వికారాబాద్ జిల్లా :- దోమ మండలం బడంపల్లిలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించడానికి తరగతి గదులు లేకపోవడం వల్ల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మా గ్రామ పెద్దలు మా గ్రామ యువకులు మహిళలు పాఠశాల దగ్గర ధర్నాలు చేయడం జరిగింది. గత వారంలో అదే గ్రామానికి చెందిన సర్పంచ్ v శంకర్ నాయక్ ఉప సర్పంచ్ శైలజ శేఖర్ దోమ మండల రెవెన్యూ అధికారి అయిన రవీందర్ కి వినతి పత్రం అందించారు సర్పంచ్ మాట్లాడుతూ.. బడంపల్లి గ్రామంలో చదువుపరంగా తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు పాఠశాలలో సరైన తరగతి గదులు లేకపోవడం వల్ల విద్యార్థులకు చదువు కోలేకపోతున్నారని పాఠశాలకు సంబంధించిన బిల్డింగ్ లో బడంపల్లి గ్రామంలో ప్రభుత్వ భూములలో పాఠశాలలో నిర్మించాలని ఎమ్మార్వో రవీందర్ ను కోరారు దానికి సంబంధించిన భూములను ప్రభుత్వపరమైనటువంటి భూములను ఎమ్మార్వో సర్వే నెంబర్ల ను తెలియజేయాలని ఆ భూములలో పాఠశాలలు నిర్మించే విధంగా ప్రభుత్వ సహకరించాలని కోరడం జరిగింది.