
జనం న్యూస్ 13 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : 5 ఏళ్లు దాటితే రాజీనామాగా పరిగణన ప్రభుత్వ పాఠశాలల్లో విధులకు సక్రమంగా రాకుండా డమ్మీలు కొడుతున్న టీచర్లు సిబ్బందిపై విద్యాశాఖ కొరడా ఝళిపించింది. అనుమతి లేకుండా ఏడాది పాటు డ్యూటీకి రాకపోతే నేరుగా ఉద్యోగం నుంచి తొలగించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.5 ఏళ్లు దాటితే ఆటో రిజైన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగికైనా 5 ఏళ్లకు మించి సెలవు ఇవ్వడానికి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఒకవేళ టీచర్ గానీ ఇతర సిబ్బంది గానీ ఏడాదికి మించి అనుమతి లేకుండా గైర్హాజరైనా లేదా 5 ఏళ్లు పూర్తిగా అబ్సెంట్ అయినా వారు ఉద్యోగానికి రాజీనామా చేసినట్లే భావించాలని స్పష్టం చేసింది. విదేశాల్లో ఉండి తిరిగి రాని వారికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. అకడమిక్కు ఆటంకం టీచర్లు అనుమతి లేకుండా డ్యూటీకి రాకపోవడంతో బడుల్లో బోధనకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గైర్హాజరైన వారిపై తక్షణం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్డీఈలు డీఈఓలకు ఆదేశాలు వెళ్లాయి. అబ్సెంట్ను గుర్తించగానే షోకాజ్ నోటీసు ఇచ్చి, సీసీఎ రూల్స్ ప్రకారం విచారణ మొదలుపెట్టాలని పేర్కొంది. అధికారులపైనా నిఘా చర్యలు తీసుకోవడంలో జాప్యం చేసిన హెడ్ మాస్టర్లు,మ ఎంఈఓలు డీఈఓలను కూడా బాధ్యులను చేస్తామని డైరెక్టర్ నవీన్ నికోలస్ హెచ్చరించారు. ప్రతి డీఈఓ ఆఫీసులో అబ్సెంట్ టీచర్ల రిజిస్టర్ మెయింటెన్ చేయాలని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. గైర్హాజరు కాలాన్ని డీస్ నన్’ గా పరిగణించి ఇంక్రిమెంట్ పెన్షన్లో కోత విధించనున్నారు