
జనం న్యూస్:10 సెప్టెంబర్ గురువారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై .రమేష్ బాలల లోకంలో విహరించిన కథలు ఎల్లకాలం నిలుస్తాయని కథ శిల్పి ఐతా చంద్రయ్య అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బక్రి చెప్యాల నందు తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా పాఠశాల 36 మంది విద్యార్థులు రాసిన కథలతో చిగురు బక్రిచెప్యాల బడి పిల్లల కథలు పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఐతా చంద్రయ్య మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అట్టి బాలలందరూ బాల సాహిత్యం చదివి సమసమాజ స్థాపనలో కృషి చేయాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కథలు గేయాలు పద్యాలు రాయడం సంతోషమన్నారు. ఉప సర్పంచ్ గందె నరేష్ మాట్లాడుతూ భాష, భావం ముఖ్యమని, చదవడం, రాయడం, వినడం అలవాటు చేసుకోవాలన్నారు. చిన్నతనంలోనే విద్యార్థులు చిన్నతనంలోనే రచనలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం పుస్తక సమీక్ష చేసి బాలల పుస్తకాలు రావడానికి ఉపాధ్యాయులు కవి వరుకోలు లక్ష్మయ్య కృషిని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలోనే బక్రి చెప్యాల విద్యార్థుల రచనలు పేరుగాంచాయన్నారు. కథల తాతయ్య ఎన్నవెల్లి రాజమౌళి మాట్లాడుతూ కథలు నూతన లోకంలోకి తీసుకెళ్తాయని, అందుకే పుస్తక పఠనం చేయాలన్నారు. శ్రీవాణి సాహిత్య పరిషత్ అధ్యక్షులు పెందోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థుల కోసం ఎంత చేసిన తక్కువేనని, బాల సాహిత్యం అవసరమన్నారు. కవి బైతి దుర్గయ్య మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా బాలసాహిత్యం ముందు వరుసలో నిలుస్తుందన్నారు. కవయిత్రి ఎడ్ల లక్ష్మి మాట్లాడుతూ బాలల కోసం ఎంత చేసినా తక్కువే అన్నారు. ద్రవ్యదాత, కవయిత్రి మాధవీలత మాట్లాడుతూ బాల సాహిత్యమృతం కోసం నిరంతరం పాటు పడతామని, విద్యార్థుల రచనలు ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. పుస్తక సంపాదకులు వరుకోలు లక్ష్మయ్య మాట్లాడుతూ బాలలో ఉన్న సృజన వెలికి తీయడమే నిజమైన ఆనందమని, బాల కవులుగా విద్యార్థులు రచనలు చేయడం ఎంతో సంతృప్తి కలిగిందన్నారు. కార్యక్రమంలో కవులు ఉపాధ్యాయులు సుహాసిని, శ్రీశైలం రమాదేవి, యాదమ్మ, శ్రీనివాస్, సునీత, రాజేందర్, సరిత, కిషన్ రెడ్డి, ఆంజనేయులు, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.