
జనం న్యూస్ జూలై 6 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కూకట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం బాలాజీ నగర్ గణేష్ గ్రౌండ్స్‌లో మొక్కలను నాటారు కార్యక్రమాన్ని నిర్వహించారు. పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ 320డి పర్యావరణ కమిటీ చైర్మన్ కోటి రెడ్డి, కూకట్పల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వెంకటరెడ్డి, కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు.సామాజిక బాధ్యతలో భాగంగా పర్యావరణహిత కార్యక్రమాలను లయన్స్ క్లబ్ నిరంతరం నిర్వహిస్తోందని, రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొని మొక్కల సంరక్షణకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.