
జనం న్యూస్ ;25 మే సోమవారం :సిద్దిపేట నియోజీకవర్గ ఇన్చార్జి వై. రమేష్ ;సిద్దిపేటలోని బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న బాలానందం ఆధ్యాత్మిక చిన్నారుల వేసవి శిబిరము ముగింపు కార్యక్రమము సోమవారం రోజున ఘనంగా జరిగింది. ఈ శిబిరంలో పాల్గొన్న చిన్నారులు యోగ, ధ్యానం, నైతిక విలువలను, పరస్పరం స్నేహపూర్వక వ్యవహారాన్ని కలిగి ఉండడం నేర్చుకున్నారు, ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలు నృత్యాలు, పాటలు, స్కిట్స్ నాటికతో ఆకట్టుకున్నారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్మార్ట్ అసోసియేషన్ సిద్దిపేట మూవీ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్,అసోసియేషన్ అధ్యక్షుడు చిరంజీవి చిన్నారుల ప్రతిభను చూసి అభినందించారు. చిన్నారులకు నటనలోని మెలకువలను నేర్పించారు, అంతేకాకుండా ఆ స్కిట్ లో ప్రతిభ కనబరిచిన కొంతమంది చిన్నారులకు నటించడానికి అవకాశాన్ని ఇస్తామని తెలిపారు. ఈ మూడు రోజుల శిబిరంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు,ప్రముఖ కవి, రచయిత, గాయకులు,వ్యాఖ్యాత వరి కోలు లక్ష్మయ్య పాల్గొని పద్యాల ద్వారా తెలుగు గొప్పతనం గురించి,నీతి కథలతో పిల్లలను అలరించారు, మరియు సుందరకాండ సత్యనారాయణ మూర్తి పాల్గొని పిల్లల చేత సుందరకాండ పారాయణం చేయించారు, శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అనుస్థాన్ స్కూల్ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారుల జీవితంలో నైతిక విలువలు మరియు విద్యా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు విద్యతో పాటు మంచి సంస్కారం క్రమశిక్షణ సేవా భావం కూడా పిల్లల్లో పెంపొందాలని,భవిష్యత్తులో సమాజానికి ఆదర్శ పౌరులగా ఎదగాలంటే చిన్నప్పటి నుంచి విలువల ఆధారిత విద్య అవసరమని దానికోసం ఏదో ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవాలని తెలిపారు, అనంతరం సంస్థ నిర్వాహకురాలు సీనియర్ రాజయోగిని బి కే భవాని మాట్లాడుతూ చిన్నారులు తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని, ఆధ్యాత్మిక విద్యతో వినయము , వ్యక్తిత్వ వికాసము, విజయం లభిస్తుందని తెలియజేశారు, సంస్థ నిర్వాహకురాలు అతిథులతో కలిసి పోటీలో గెలిచిన చిన్నారులకి బహుమతులను అందజేశారు అలాగే శిబిరంలో పాల్గొన్న ప్రతి చిన్నారికి ప్రత్యేక కానుకలను అందించారు, క్యాంపులో పాల్గొన్న చిన్నారులు వాళ్ళ అనుభవాలను అందరితో పంచుకున్నారు, ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి బి కే స్వప్న బిందు, ఓంకారం, ఉదయ్ కుమార్, వంశీ పాల్గొన్నారు.