
బిచ్కుంద జూన్ 23 జనం న్యూస్ ఈ నెల 25వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ కొనసాగుతుందని బిచ్కుంద తహసీల్దార్ వేణుగోపాల్ వెల్లడించారు. మంగళవారం బిచ్కుంద మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో బిచ్కుంద మండలాల పరిధిలోని బి.ఎల్.ఒ లకు ఎస్.ఐ.ఆర్ ప్రక్రియపై శిక్షణా కార్యక్రమం, అలాగే బి.ఎల్.ఎ లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో భాగంగా నిర్వహించే ఈ ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా, తప్పులు లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో బి.ఎల్.ఒలు, బి.ఎల్.ఎలు సమన్వయంతో పనిచేస్తూ ఈ నెలకు పైగా జరిగే ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.ఈ అవగాహన సదస్సులో పెద్ద కొడప్గల్ తహసీల్దార్ రాజశేఖర్ మరియు గిదావర్ అంజు ఎమ్మార్వో సిబ్బంది కుశాల్ బి.ఎల్.ఒలు, బి.ఎల్.ఎలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.