

---మద్యం విక్రయించడం మద్యం సేవించేందుకు సిట్టింగ్ ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు
బిచ్కుంద ఆగస్టు 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో
గురువారం రోజు బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలోని 10 ధాబాల యజమానులకు నోటీసులు జారీ చేయడం జరిగింది.
ధాబాలలో అక్రమంగా మద్యం విక్రయించడం, మద్యం సేవించేందుకు సిట్టింగ్ ఏర్పాటు చేయడం లేదా ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సహకరించినా సంబంధిత యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురు ధాబా యజమానులపై కేసులు నమోదు చేసి, బైండోవర్ చర్యలు కూడా చేపట్టడం జరిగింది.అదేవిధంగా, ధాబాలకు వచ్చే అపరిచిత వ్యక్తుల వివరాలను వెంటనే డయల్-112 లేదా బిచ్కుంద పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని సూచించడం జరిగింది. ప్రతి ధాబాలో పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించడం జరిగింది.ధాబాల ముందు ఎవరైనా అనుమతి లేకుండా లారీలు లేదా ఇతర భారీ వాహనాలు పార్కింగ్ చేసినట్లయితే, అందుకు సంబంధిత ధాబా యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుందని గట్టి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ప్రత్యేక తనిఖీలు, నిఘా చర్యలు నిరంతరం కొనసాగుతాయని ఎస్సై రాజు తెలిపారు,