
బిచ్కుంద ఆగస్టు 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం లో. గురువారం రోజు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీమా గంగారం సార్ మాట్లాడుతూ ప్రధానిగా రాజీవ్ గాంధీ ఐటీ మరియు టెలికాం విప్లవం తెచ్చి దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దారని అన్నారు. దేశంలో ఓటింగ్ వయసును 21 సంవత్సరాలు నుండి 18 సంవత్సరాలకు తగ్గించటం, విద్య సంస్కరణలు జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం, పంచాయతీ రాజ్ వ్యవస్థ పటిష్ట పరుస్తూ స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు రిజర్వేషన్ల ప్రతిపాదన, ఆర్ధిక సరళీకరణ, శాంతి ఒప్పందాలు కుదిర్చి ప్రాంతీయ జాతీయ విభేదాలు లేకుండా రాజకీయ పర నిర్ణయాలు తీసుకొన్న గొప్ప నాయకులు రాజీవ్ గాంధీ అని అన్నారు. దేశములో శాంతి కోసం ప్రయత్నాలు చేసిన రాజీవ్ గాంధీ చివరకు దేశం కోసమే ప్రాణాలు కోల్పోయారు అని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమములో భాస్కర్ రెడ్డి తో పాటు కౌన్సిలర్ నిమిషా నాయక్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్ కౌన్సిలర్ ధర్పల్లి గంగాధర్ కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ మునిసిపల్ కాప్షన్ నెంబర్ హనుమాన్లు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.