
----జెండా ఆవిష్కరణ వైస్ చైర్మన్ యాదవ్ రావు
బిచ్కుంద జూలై 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో అంతర్జాతీయ సహకార దినోత్సవం మరియు సహకార వారోత్సవాల సందర్భంగా బిచ్కుంద రైతు సేవ సహకార సంఘంలో . వైస్ చైర్మన్ యాదరావ్ చేతుల మీదుగా సహకార జెండా ఆవిష్కరణ జరిగింది. వైస్ చైర్మన్ మాట్లాడుతూసహకార సంఘం రైతుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని, రైతులకు నిరంతరం సేవలందిస్తుందని యాదరావ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు చంద్రకాంత్ పటేల్, శివరాజ్ పటేల్, కార్యదర్శి శ్రావణ్, క్యాషియర్ సచిన్, సిబ్బంది సాయిలు, శ్రీనివాస్, వేణు, రైతులు తదితరులు పాల్గొన్నారు.