
బిచ్కుంద ఆగస్టు 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో బిచ్కుంద మున్సిపాలిటీలో ఆషాడ మాసం సందర్భంగా మంగళవారం బోనాల పండుగను గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు గ్రామస్తులు బాజా భజంత్రీల నడుమ బోనాలు నైవేద్యాలను గ్రామదేవతలకు, నల్ల పోచమ్మ అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది