
జనం న్యూస్ ఆగస్టు 19 ముమ్మిడివరం ప్రతినిధి(గ్రంధి నానాజీ) జాతీయ బిజెపి అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్యఅతిథిగా, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంస్థాగత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ను రాష్ట్ర బిజెపి ఎగ్జిక్యూటివ్ నెంబర్ కర్రి చిట్టిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు.పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని, స్థానిక ఎన్నికల్లో అందరూ కలిసి సమష్టిగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని నితిన్ నబీన్ సూచించారు. ప్రజావసరాలకు అనుగుణంగా ప్రజా క్షేత్రంలో పనిచేసి, కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా బిజెపి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని చిట్టిబాబును కోరారు.