
జనం న్యూస్ జూన్ 3 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) కార్యకర్తలు తమ గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేసి, గ్రామాల్లో బీజేపీని బలోపేతం చేయాలని మాజీ శాసనసభ్యులు అయ్యాజీ వేమా పిలుపునిచ్చారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజవర్గంపి.గన్నవరం మండల బీజేపీ శాఖ అధ్యక్షుడు తిక్క సత్యనారాయణ అధ్యక్షతన బుధవారం మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా మాట్లాడుతూ, ప్రతి నెలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని బూత్ స్థాయిలో స్థానిక ప్రజలతో కలిసి వినాలని కోరారు.అన్ని గ్రామాల్లో సాధ్యమైనంత వరకు బీజేపీ పార్టీ జెండా ఏర్పాటు చేయాలని, ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో నిర్వహించే ‘జనతా వారధి’ కార్యక్రమంలో పాల్గొని స్థానిక సమస్యలపై వినతి పత్రాలు జిల్లా పార్టీకి అందించాలని సూచించారు. ఈ వినతులను జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే ‘మీ కోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా ఆంధ్రుల అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన లంకలగన్నవరం గ్రామానికి చెందిన డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పవిత్ర వారాణాసిలో ఆమె పేరిట ఆశ్రమం ఏర్పాటు చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కాపవరం గ్రామానికి చెందిన దండు త్రినాధ రాజు గారికి సమావేశం ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసింది. దండు త్రినాధ రాజు గారికి పేరణ కలిగించిన పి.గన్నవరం మండలం బెల్లంపూడి గ్రామ నివాసి అనిశెట్టి వెంకటేశ్వరరావును మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాసరావు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మేడిది సత్యనారాయణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తోలేటి సుబ్బారావు, మాజీ జిల్లా కార్యదర్శి అడ్డాల వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు కుడుపూడి సూర్యనారాయణ, OBC మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వరరావు, మండల కోశాధికారి బోడ్డు రామకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి కోటే శివాజీ, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు దిగుమర్తి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.