
జనం న్యూస్ ; 15 జులై బుధవారం ; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; భారతీయ జనతా పార్టీ మీడియా సెల్ సిద్దిపేట జిల్లా కన్వీనర్ గా గోనె మార్కండేయులు నియామకమయ్యారు.ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.కాగా వరుసగా నాలుగోసారి మీడియా కన్వీనర్ గా మార్కండేయులు నియామకం జరిగింది.ఈ సందర్భంగా మార్కండేయులు మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలకు అందుబాటులో ఉంటూ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు.తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పజెప్పిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు,ఎంపీ రఘునందన్ రావు,జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ తో పాటు పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.