
జనం న్యూస్ సెప్టెంబర్ 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా న్యాయ విభాగం నాయకులు చేదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ రాజేశ్వరరావు ఆశీస్సులు తీసుకున్నారు.అనంతరం వడ్డేపల్లి రాజేశ్వరరావు శ్రీనివాస్ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజాసేవలో మరింతగా రాణిస్తూ పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు శ్రీనివాస్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో శేర్లింగంపల్లి నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులు దానబోయిన నర్సింగ్ రావు, కూకట్పల్లి డివిజన్ నాయకులు అనంత నాగరాజు, దుర్గా ప్రసాద్ రావు, కట్ట శంకర్ రెడ్డి, ప్రశాంత్ రావు, సంతోష్ గుప్తా, శేఖర్ రావు, వినయ్, ఫణీంద్ర శర్మ, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.