
జనం న్యూస్ జూన్ 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందరిపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నుండి ఎలాంటి పిలుపునివ్వ కున్న కూడా ఈరోజు ఉదయం 6 గంటలకె పోలీసులు బిఆర్ఎస్ సీనియర్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఇంటి వద్దకు వెళ్లి అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన నాటినుండినేటి వరకు20సార్లు బిఆర్ఎస్ రాష్ట్రనాయకులుకొమ్ముల శివ ను అరెస్టుచేశారు ఆయన తెలిపారు ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అరెస్టుల పాలన నడుస్తుదని బిఆర్ఎస్ పార్టీ నుండి ఏలాంటి పిలుపునివ్వకున్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు భయపడుతుందని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో ఇప్పటికైనా అక్రమ అరెస్టులు నిలిపివేసి మీకున్న ఈ రెండున్నర సంవత్సరాల కాలమైనా ప్రజాపాలన కొనసాగించాలని పిలుపు నిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైందని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడంలో విఫలమైందని ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలలో విఫలమైందని తెలిపారు రాబోయే కాలంలో ప్రజల చేతిలో విద్యార్థుల యువకుల చేతిలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ పతనం ఖాయమని అన్నారు….