
జనం న్యూస్ ఆగస్టు 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత సిరికొండ మధుసూదనాచారి తనయుడు సిరికొండ ప్రశాంత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలువురు కూరగాయల వ్యాపారులు గొడుగులు అందచేసారు అనంతరం మండలంలోని పెద్దకొడపాక గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తల్లి దివ్యాంగుల సేవాసమితి అధ్యక్షులు బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్జి శంకర్ బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉద్యమ కారుల పోరం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు పోశెట్టి గణేష్ బీ ఆర్ ఎస్ యూత్ నాయకుడు తరుణ్ గోపి బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు గిద్దమారి రాము అశోక్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…